కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌‌ను ఖండించిన కేటీఆర్‌

59చూసినవారు
కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌‌ను ఖండించిన కేటీఆర్‌
హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టును బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఖండించారు. కౌశిక్‌రెడ్డి అరెస్టు దుర్మార్గమన్నారు. పూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్ సర్కారుకు ఓ అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టు చేయడం పూర్తిగా అప్రజాస్వామికమన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్