ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తెలుగు మూలాలున్న అమెరికన్ టీనేజీ కుర్రాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. 19 ఏళ్ల నిశేష్ బసవారెడ్డి.. దిగ్గజ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో నేడు జకోవిచ్, బసవారెడ్డి మధ్య తొలి రౌండ్ మ్యాచ్ జరిగింది. తొలి సెట్‌ను 6-4తో చేజిక్కించుకున్న బసవారెడ్డి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. అయితే చివరికి గట్టి పోటీ ఇచ్చి 6-4, 3-6, 4-6, 2-6తో ఓటమిపాలయ్యాడు.