మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలోని పోలీస్ కవాతు మైదానంలో ఘనంగా జరిగాయి. 526 స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ. 1. 05 కోట్ల రుణాలను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అభివృద్ధిని చాటి చెప్పేలా శకటాల ప్రదర్శన ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు.