అగ్నిప్రమాదంలో పసిపాపతో సహా నలుగురు దుర్మరణం (వీడియో)

51చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలోని షాహదారా ప్రాంతంలోని ఓ నివాస భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 నెలల పసిపాపతో సహా నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు ప్రథమ్ సోని (17), రచన (28), గౌరీ సోని (40), రూహి (9 నెలలు)గా గుర్తించారు. భవనంలో మంటలు చెలరేగడంతో ఊపిరాడక మరణించారని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్