చిలకలూరిపేట: పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

54చూసినవారు
చిలకలూరిపేట పరిధిలోని గణపవరం వద్ద కాటన్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ. చివరి క్వింటా వరకు రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తామన్నారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వటంతో పాటు 15% తేమ ఉన్నాసరే కొనుగోలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులను ఆదుకుంటుందని తెలిపారు.