బాపట్ల జిల్లా చీరాల సముద్రతీర ప్రాంతంలోని బీచ్ రోడ్లను డబల్ రోడ్లుగా మారుస్తున్నట్లు చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ తెలిపారు. వాడరేవు బీచ్ నుండి రామాపురం కటారి వారి పాలెం, పొట్టి సుబ్బయ్య పాలెం బీచ్ వరకు ఉన్న సింగిల్ రోడ్డును డబల్ రోడ్లుగా ఆధునికీకరించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించగా, అధికారులు పనులు చేపట్టారు.