రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు పేరిట సామాన్యుల నడ్డి విరుస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. సోమవారం గుంటూరులోని మల్లయ్య లింగం భవన్లో జంగాల మాట్లాడారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఉన్నాయని, ఈ క్రమంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారన్నారు.