గుంటూరు: ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట రోగి బంధువుల ఆందోళన

50చూసినవారు
గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎదుట మంగళవారం రోగి బంధువులు ఆందోళన చేపట్టారు. రోగి బంధువులు తెలిపిన వివరాల మేరకు క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన బండ్ల లక్ష్మణరావు లివర్ ఇన్ఫెక్షన్ తో గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఐదు రోజులుగా ట్రీట్ మెంట్ ఇస్తూ రూ. 3 లక్షల వరకు తీసుకొని సరిగా వైద్యం అందించలేదంటూ రోగి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కొత్తపేట పోలీసులు నిరసనకారులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్