గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీగా రమేశ్ బాధ్యతలు

58చూసినవారు
గుంటూరు ట్రాఫిక్ సబ్ డివిజన్ డీఎస్పీగా ఎం. రమేశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డీఎస్పీలను బదిలీలు చేశారు. వారిలో గతంలో తెనాలి డీఎస్పీగా పనిచేసిన రమేశ్ ను గుంటూరు ట్రాఫిక్ విభాగానికి నియమించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డీఎస్పీ రమేశ్ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారణకు కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్