గుంటూరులో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు

62చూసినవారు
గుంటూరులో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 163వ జయంతిని పురస్కరించుకొని జేకేసీ కాలేజ్ రోడ్డులో ఆదివారం ఇంజినీర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. లైసెన్స్ డ్ ఇంజినీర్స్ అసోసియేషన్, ప్రొఫెషనల్ ఇంజినీర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహించాయి. స్ట్రక్చరల్ కన్సల్టెంట్ వి. ఆంజనేయ ప్రసాద్ ఈ వేడుకలకు అతిథిగా హాజరై సహ ఇంజినీర్లతో కలిసి విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్