గుంటూరులో ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ యజమానులు మంగళవారం ఆందోళన చేపట్టారు. అధికారుల తీరుకు నిరసనగా రోడ్డుపై ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుకను ఇస్తున్నామని చెప్పారు. అయితే అనధికారికంగా అధికారులు మాపై కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. అధికారులు ఇప్పటికైనా సరైన నిర్ణయాన్ని తీసుకుని న్యాయం చేయాలని కోరారు.