గుంటూరు: పెండింగ్ బకాయిలు చెల్లించాలి

69చూసినవారు
గుంటూరు స్త్రీ శిశు సంక్షేమ శాఖ హైయర్ వాహనాల యజమానులు, డ్రైవర్లు సోమవారం ఆందోళన చేపట్టారు. అమరావతి రోడ్డులోని రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. గత రెండేళ్ల నుంచి హైయర్ వాహనాలకు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయని యూనియన్ నాయకులు సత్యనారాయణ తెలిపారు. ప్రతి వాహనానికి రూ. 2 నుంచి 3 లక్షల వరకు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్