అభ్యుదయ కవితా పితామహుడుగా బిరుదుగాంచిన గురజాడ వెంకట అప్పారావు 162వ జయంతి వేడుక శనివారం గుంటూరు కలెక్టరేట్లో నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ డిపియం లక్ష్మీ కుమారి, జిల్లా రెవిన్యూ అధికారిణి పెద్ది రోజా పూలమాలలు సమర్పించి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.