రానున్న ఎన్నికల్లో టిడిపి పతనం ఖాయమని వైసిపి నాయకులు అలా కిరణ్ తెలిపారు. బుధవారం సాయంత్రం అరండల్ పేటలో జరిగిన కార్యక్రమంలో నూతనంగా పదవులు పొందిన వైఎస్ఆర్సిపి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ బైరెడ్డి రవీంద్రారెడ్డి మరియు జిల్లా సేవాదళ్ కార్యదర్శిగా నియమించబడిన రెడ్డి కోటేశ్వరరావుకు వైసిపి నాయకులు కాటూరి విజయ్, ఆలా కిరణ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. కిరణ్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభిస్తుందన్నారు