స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని, వారి త్యాగ ఫలితమే ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని మాచవరం మండల జడ్పీటీసీ శివ యాదవ్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి, జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.