రెంటచింతల మండలం తుమ్మకోట గ్రామంలో శ్రీ రామకృష్ణ సేవా సమితిని మాచర్ల రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి ప్రారంభించారు. స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం శ్రీ రామకృష్ణ సేవా సమితిని ప్రారంభించినట్లు మాచర్ల అధ్యక్షుడు మెట్టు గోవింద రెడ్డి తెలిపారు. స్వామి వివేకానంద భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సేవాసముతులను ఏర్పాటు చేశామన్నారు.