మంగళగిరి నగరంలోని ఆటో నగర్లో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. షాప్ నంబర్ 139లో ఉన్న ప్లాస్టిక్ సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. పక్కనే విద్యుత్ స్తంభాలు ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలకు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.