మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్ సి ని బుధవారం గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెల్త్ సెంటర్ లో ఓపి సేవలు ఎలా ఉన్నాయి, ల్యాబ్ లో రోజుకి ఎన్ని పరీక్షలు జరుగుతున్నాయి, పరికరాలు పనితీరు, ఫార్మసీలో మందులు కొరత ఏమైనా ఉందా అనే విషయాలను హెల్త్ సెంటర్ డాక్టర్ అనూషను అడిగి విజయలక్ష్మి తెలుసుకున్నారు.