కేదార్ నాథ్ లో చిక్కుకున్న 18 మంది తెలుగు యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం, మంత్రి లోకేశ్ మాట్లాడుతూ స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, ఈలోగా యాత్రికులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారాన్ని కోరామన్నారు. యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు.