పల్నాడు: ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్

77చూసినవారు
పల్నాడు: ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్
ఉద్యోగులు విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బాబు హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహించిన అచ్చంపేట విస్తరణ అధికారి కే. వీర్రాజు, బొల్లాపల్లి మండలం విస్తరణ అధికారి జానీ బాషాలను విధుల నుంచి తొలగించినట్లు సోమవారం తెలిపారు. వారు విధుల నిర్వహణలో ఇరువురు అలసత్వం చూపారని పేర్కొన్నారు. ఈ క్రమంలో విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్