పల్నాడు జిల్లా నరసరావుపేట వన్ టౌన్ సిఐగా పనిచేస్తున్న ఎం విజయ్ చరణ్ కి ఉత్తమ సిఐగా అవార్డు వరించింది. గురువారం పల్నాడు జిల్లా డీ ఎస్ ఏ స్టేడియంలో నిర్వహించిన 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలో మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఆయన ఉత్తమ అవార్డు తీసుకున్నారు.