నరసింగపాడులో కొలువైన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో శని త్రయోదశి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, నవగ్రహాలకు తైలాభిషేకాలు చేశారు. ఆలయంలో శనీశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.