ఇంకొల్లులో ఇంటిపై పడిన పిడుగు, తప్పిన పెను ప్రమాదం

579చూసినవారు
ఇంకొల్లులో ఇంటిపై పడిన పిడుగు, తప్పిన పెను ప్రమాదం
మండల కేంద్రమైన ఇంకొల్లులో సోమవారం తెల్లవారుజామున ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసిన సందర్భంగా షేక్ ఖాసిం వలి అనే వ్యక్తి ఇంటి పిట్టగోడపై పిడుగు పడింది. ఆ ధాటికి ఇంట్లోని కరెంటు మీటర్ కూడా కాలిపోయింది. అయితే పిడుగు పిట్ట గోడపై పడడంతో ఇంట్లోని వారికి ఎవరికీ ఏమీ కాలేదు. అదే ఇంటిపై పడి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేది. ఖాసిం వలీ ఫిర్యాదు మేరకు వీఆర్వో సురేష్ బాబు ఘటనా స్థలాన్ని సందర్శించారు.
Job Suitcase

Jobs near you