చేబ్రోలు మండలం సుద్ధపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో కోడూరి ప్రభుదాస్, కొమ్ము తంబి, కిరణ్ కుటుంబాలకు చెందిన రెండు పూరీళ్ళు ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.