కాకుమాను గ్రామంలోని జడ్పీ పాఠశాలలో గురువారం చేతన ఫౌండేషన్ అధినేత వెనిగండ్ల రవికుమార్ సహకారంతో రామినేని మాధవి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్ , పెన్నులను బహుకరించారు. కార్యక్రమంలో కాకుమాను మండల విద్యాశాఖ అధికారులు కెఎఫ్ కెరడీ, కె విజయభాస్కర్ పాల్గొని మాట్లాడుతూ విద్యాభివృద్ధికి దాతలు సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యా సామాగ్రి పంపిణీ చేసిన దాతలను వారు అభినందించారు.