కాకుమానులో సామాజిక తనిఖీ సమన్వయ కమిటీ సమావేశం

51చూసినవారు
గుంటూరు జిల్లా కాకుమాను మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎన్ఆర్ఈజీఎస్ పథకం సామాజిక తనిఖీ సమన్వయ సమావేశం జరిగింది. జడ్పిటిసి ముజావర్ గుల్జార్ బేగం, ఎంపిపి రామినేని శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు సోషల్ ఆడిట్ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. గత ఏడాది ఈ ఏడాది మిగిలిన పనులను గుర్తించి గ్రామాల్లోని కూలీలకు పని కల్పించాలని కోరారు. ఎంపీడీవో రామకృష్ణ, సోషల్ ఆడిట్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్