చీటింగ్ కేసులో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో ఆర్పి గా పని చేసిన షేక్ ముంతాజ్ బేగం, ఏ మున్ని నీ గురువారం అరెస్టు చేసినట్లు రేపల్లె పట్టణ సీఐ మల్లికార్జున రావు తెలిపారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. ముద్దాయిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.