సత్తెనపల్లిలో దోపిడీ దొంగలు హల్ చల్ చేశారు. స్థానికుల కథనం మేరకు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రహదారిలో ఇల్లు అద్దెకు కావాలని గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధులు నివాసం ఉంటున్న ఇంట్లోకి వచ్చి వారిపై దాడికి ప్రయత్నించి దొంగతనానికి యత్నించారు. వృద్ధులు కేకలు వేయటంతో దుండగులు బైక్ను అక్కడే వదిలివేసి పరారయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు బుధవారం సమాచారం అందించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.