చెన్నైలోని కొరియా కాన్సులేట్ జనరల్ కిమ్ చాంగ్ యున్ తో పాటు కెక్సిమ్ బ్యాంక్ ఎన్డీఆర్వో ముఖ్య ప్రతినిధి జంగ్ వాన్ రియూ, కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ డైరెక్టర్ చాంగ్ వూ చాన్లతో బుధవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో చేపడుతున్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు కెక్సిమ్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు.