కొల్లిపర మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఆయన అక్కడ క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని, కలిసి మెలిసి ఉంటూ మత సామరస్యాన్ని చాటాలని పెమ్మసాని సూచించారు.