వినుకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఆదివారం ఎక్సైజ్ సీఐ డీ. శ్రీనివాసరావు తెలిపారు. నూజెండ్ల మండలంలోని రవ్వారం, కంభంపాడు, పట్టణంలో అనధికారికంగా మద్యం సీసాలు తీసుకువెళ్లి బెల్టు షాపుల్లో అమ్మకాలు నిర్వహిస్తుండగా తనిఖీలు నిర్వహించి 28 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.