జమ్మూలోని శ్రీమాతా వైష్ణోదేవీ పుణ్యక్షేత్రం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూలోని పవిత్ర ఆలయానికి వెళ్లేందుకు వీలుగా తలపెట్టిన రోప్ వే నిర్మాణ పనుల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. పనులు పూర్తయితే భక్తులు వేగంగా, సులభంగా వైష్ణోదేవీ ఆలయానికి చేరుకునేందుకు అవకాశం ఉంటుందని బోర్డు సీఈవో అన్షుల్ గార్గ్ కాట్రాలో మీడియాకు వెల్లడించారు.