ప్రేమజంటపై భూమా అఖిల బాడీ గార్డ్ దాడి!

9634చూసినవారు
ప్రేమజంటపై భూమా అఖిల బాడీ గార్డ్ దాడి!
నంద్యాల పరిధి అళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ లో ప్రేమజంట వివాదం నెలకొంది. ఓ ప్రేమికునిపై సిఐ సమక్షంలోనే దాడి చేశాడు ఎమ్మెల్యే భూమా అఖిల బాడీ గార్డ్ నిఖిల్. అయితే.. ఈ దాడిని అడ్డుకున్నారు సిఐ. దీంతో పోలీసులతో నిఖిల్ వాగ్వాదం పెట్టుకున్నారు. చాగలమర్రికి చెందిన సాయి అనే అమ్మాయి, మైదుకూరుకు చెందిన ప్రవీణ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇది న‌చ్చ‌ని అమ్మాయి వాళ్ల అన్న‌య్య ఎమ్మెల్యే బాడీగార్డ్‌ల‌తో క‌లిసి దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది.