అమెరికాలోని పలు రాష్ట్రాలలో కేటగిరి-4 తుఫాను హెలీన్ హరికేన్ బీభత్సం సృష్టించింది. తీరం దాటిన తర్వాత కూడా హెలీన్ భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది. మొత్తంగా హరికేన్ హెలీన్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 64కు పెరిగింది. 15 నుంచి 26 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లింది. హెలీన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలకు సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.