నంద్యాల పర్యటనలో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విజయ డైరీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డైరీలో ఎన్టీఆర్ శిలాఫలకం తొలగించడం, చైర్మన్ ఛాంబర్‌లో మాజీ సీఎం జగన్ ఫోటో ఉండటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. విజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి, భూమా అఖిలప్రియ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.