వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు టీడీపీ కండువా కప్పుకున్నారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.