నేటితో ముగియనున్న ఉత్సవాలు

61చూసినవారు
నేటితో ముగియనున్న ఉత్సవాలు
ఆశ్వయుజ మాసంలో ఎనిమిదో రోజైన దుర్గాష్టమి నాడు బతుకమ్మను ‘సద్దుల బతుకమ్మ’గా జరుపుకొంటారు. దీన్ని 'పెద్ద బతుకమ్మ' అని కూడా పిలుస్తారు. ఈ రోజున తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ.. ఇలా రెండు బతుకమ్మలను పేర్చి.. హోరెత్తే ఉయ్యాల పాటలతో మహిళలంతా ఎంతో వైభవంగా బతుకమ్మ ఆట ఆడుకుంటారు. ఈ రోజున పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడి.. ఇలా ఐదు రకాల సద్దులను అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆట పూర్తయిన అనంతరం బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్