ఎనిమిది రోజులుగా సాగుతున్న వేడుకలు చివరి దశకు చేరాయి. రాష్ట్రం అంతటా గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. తీరొక్క పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలు ప్రజలకు కనువిందు చేయనున్నాయి. కోలాటాలు, చప్పట్లతో ఊరూవాడ మారుమోగనుంది. చెరువులన్నీ పూలసంద్రంగా మారనున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, అధికారులు ఏర్పాట్లు చేశారు.