ఎన్టీఆర్ జిల్లా బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ ప్రమాద ఘటనలో బుధవారం మరో వ్యక్తి మృతి చెందాడు. మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాణావతి స్వామి (30) మరణించాడు. దాంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మరో ఆరుగురు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.