మాజీ సైనికుడు దారుణ హత్య (వీడియో)

55చూసినవారు
విశాఖపట్నంలోని గాజువాక జగ్గు జంక్షన్ వద్ద మాజీ సైనికుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు వెంటాడి వేటాడి అతి కిరాతకంగా నరికి చంపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు నిందితులు లొంగిపోయారు. భూతగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు సమాచారం. మృతుడు మాజీ సైనికుడు వేమిరెడ్డి అప్పలనాయుడిగా గాజువాక పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్