వినాయకుడిని ప్రతిష్టించే పూజ గదిని, మండపాలను అలకరించేందుకు సింపుల్ ఐడియాలు మీకోసం.
1. పూజ కోసం సరైన స్థలం: వినాయకుడి విగ్రహాన్ని ఉంచడానికి ఇంట్లో అత్యంత పవిత్రమైన స్థలాన్ని ఎంచుకోని శుభ్ర పరచాలి.
2. రంగురంగుల దుస్తులు: చీరలు, దుపట్టాలు వంటివి అలంకరణకు ఉపయోగించవచ్చు. పవిత్రమైన, అందమైన బట్టలతోనే అలంకరించాలి.
3. రంగు రంగుల పూలు: బంతి పువ్వు, గులాబీ, చామంతి, మల్లె పువ్వులను ఉపయోగించవచ్చు. ఇవి పూజకు కూడా మంగళకరమైనవిగా భావిస్తారు. అలంకరణ కోసం కృత్రిమ పుష్పాలను కూడా ఉపయోగించవచ్చు.
4. లైటింగ్: ఇంట్లోనే కాకుండా గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రదేశంలో కూడా రంగురంగుల లైట్లను అమర్చండి.
5. రంగు కాగితాలు-బెలూన్లు: రంగు కాగితాలతో పూలు, ఫ్యాన్లు, ఫ్రిల్స్, గొడుగులు, సీతాకోక చిలుకలు, వాల్ హ్యాంగింగ్స్ వంటి వాటిని తయారు చేయవచ్చు. రంగురంగుల బెలూన్లతో గోడలను అలంకరించవచ్చు.