ముంబైలో ఈ నెల 18న జరిగిన ఓ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓలా క్యాబ్ డ్రైవర్ ప్రమాదవశాత్తు ఆడీ కారును ఢీకొట్టాడు. వెంటనే ఆడీ ఓనర్ రిషబ్ చక్రవర్తి కారుకి డ్యామేజ్ అవ్వడంతో.. ఓలా డ్రైవర్ ను రెండు చేతులతో అమాంతం పైకి లేపి నేలకేసి కొట్టాడు. అనంతరం అతన్ని కాలితో తన్నాడు. ఈ దాడిలో ఓలా డ్రైవర్ గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.