కన్న తల్లిని దుప్పటితో గొంతునులిమి చంపిన 21 ఏళ్ల యువకుడు

609చూసినవారు
కన్న తల్లిని దుప్పటితో గొంతునులిమి చంపిన 21 ఏళ్ల యువకుడు
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణం జరిగింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న తల్లి జ్యోతి(48)తో నీలేష్ (21) అనే యువకుడు గొడవపడ్డాడు. దీంతో తల్లిపై కత్తితో దాడి చేసి దుప్పటితో గొంతునులిమి చంపేశాడు. అనంతరం తల్లి మృతదేహం పక్కన తాను ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్టులు చేశాడు. ‘‘సారీ అమ్మ నేను నిన్ను చంపేశాను. నేను నిన్ను మిస్ అవుతున్నాను. ఓం శాంతి’’ అని పోస్ట్స్ పెట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్