అక్రమ రుణయాప్‌ల ఆగడాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2022లో నిర్ణయం తీసుకుంది. యాప్ స్టోర్లలో కేవలం చట్టబద్ధమైన యాప్స్ మాత్రమే ఉండాలని మిగతావి తొలగించాలని ఆర్‌బీఐకి సూచించింది. కానీ పాతవాటిని తొలగిస్తే కొత్త పేర్లపై యాప్‌లు రూపొందించి దుండగులు ఆగడాలకు పాల్పడుతూనే ఉన్నారు. కొన్ని యాప్‌లలో వడ్డీ మినహాయించుకుని మిగతా మొత్తాన్నే రుణగ్రహీత ఖాతాలో వేస్తారు. ఒక యాప్‌లో చేసిన అప్పు తీర్చటానికి మరో యాప్ నుంచి అప్పు ఇప్పించేలా నిర్వాహకులే సహాయం చేస్తుండటం గమనార్హం.