టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంపై బుద్దా వెంకన్న ఫిర్యాదు

72చూసినవారు
టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంపై బుద్దా వెంకన్న ఫిర్యాదు
వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్‌ బాండ్లలో అనేక కుంభకోణాలు జరిగాయని టీడీపీ సీనియర్‌ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. రూ.వేల కోట్లు దోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఈ కుంభకోణంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు జగన్‌ రూ.42వేల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ సీఎం అయ్యాక ఇసుక, గనులు, మద్యం, భూముల మీద దోపిడీ చేశారని బుద్దా వెంకన్న మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్