‘రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖకు బడ్జెట్లో రూ. 8,495 కోట్లు కేటాయించాం’ అని హోంమంత్రి అనిత అన్నారు. ఇవాళ ఆమె మాట్లాడారు. ‘గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని పట్టిపీడించిన మాదకద్రవ్యాలను రాష్ట్రంలో లేకుండా చేసేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నాం. శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం, రాజమహేంద్రవరంలో కొత్తగా 4 స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు చేస్తాం’ అని అనిత పేర్కొన్నారు.