మంటల్లో బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం

51చూసినవారు
మంటల్లో బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం
తిరుపతి, శ్రీకాళహస్తీ హైవేపై ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. రేణిగుంట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్