వాలంటీర్ల పునరుద్ధరణపై కేబినెట్‌లో చర్చ

53చూసినవారు
వాలంటీర్ల పునరుద్ధరణపై కేబినెట్‌లో చర్చ
ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై మంత్రివర్గంలో చర్చించినట్లు సమాచారం. వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ హయాంలో వాలంటీర్లే కీలకంగా మారి పాలన చేసిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా? లేదా? అనే సందిగ్ధత ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్