AP: టమాటా ధర భారీగా పతనమైంది. నంద్యాల జిల్లా ప్యాపిలిలోని మార్కెట్‌లో కిలో టామాటా ఒక్క రూపాయికి పడిపోయింది. 20 కిలోల టామాట బాక్స్ రూ.50 నుంచి 60లకు మాత్రమే పలుకుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సెప్టెంబర్ నుంచే ఫిబ్రవరి వరకు టమాటా దిగుబడి బాగా ఉంటుంది. ఇన్ని రోజులు కాసులు కురిపించిన టమాటా ఇప్పుడు కనీసం గిట్టుబాటు ధర కూడా పలకకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.