యువకుడిని ఢీకొట్టి కారుడ్రైవర్ పరార్ (వీడియో)

58చూసినవారు
యూపీలోని కాన్పూర్‌లో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. కిద్వాయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిరాలా నగర్‌లో ఓ యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడికి ఎదురుగా ఓ కారు దూసుకొచ్చింది. రెప్పపాటులో ఆ యువకుడిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆ యువకుడి నిర్లక్ష్యం కూడా కనపడుతోంది. వేగంగా వస్తున్న కారు వైపు కావాలనే ఆ యువకుడు వెళ్లాడు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్